Chest Pain: తరచూ ఛాతీ నొప్పి వస్తుందా? గుండెపోటు కాదు.. మిగతా సమస్యలు కావచ్చు.. అవేంటో తెలుసుకోండి

by Bhoopathi Nagaiah |
Chest Pain: తరచూ ఛాతీ నొప్పి వస్తుందా? గుండెపోటు కాదు.. మిగతా సమస్యలు కావచ్చు.. అవేంటో తెలుసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటికాలంలో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ(gas and acidity) సమస్యతో బాధపడుతున్నారు. ఎసిడిటీ సమస్య వల్ల ఒక్కోసారి ఛాతీలో నొప్పి వచ్చి గుండె చప్పుడు పెరుగుతుంది. అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు, చాలామంది దానిని గుండెపోటుగా భావిస్తారు. అయితే ప్రతిసారీ గుండెపోటు(Heart Attack) మాత్రమే కాకుండా ఇతర సమస్యలు కూడా దీనికి కారణమవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఛాతీ నొప్పి ఎందుకు వస్తుంది?

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అధిక పీహెచ్ లోడింగ్, ఒత్తిడితో కూడిన ఉద్యోగం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనె, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పటికీ, అది జీర్ణవ్యవస్థపై అధిక భారాన్ని మోపుతుంది. దీని కారణంగా, ఆహారం జీర్ణం(Digestion) కావడానికి ఎక్కువ యాసిడ్ విడుదల అవుతుంది. ఇలాంటి ఆహారం పదే పదే తింటే కడుపులో గ్యాస్ ఏర్పడి ఛాతి నొప్పి(Chest Pain) వస్తుందని వైద్యులు చెబుతున్నారు. సమయానికి ఆహారం తినకపోయినా.. ఛాతీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే కొన్ని పరీక్షల ద్వారా ఈ సమస్యకు అసలు కారణాన్ని గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనితో పాటు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని చెబుతున్నారు.

ఇవి మానుకోండి:

గ్యాస్ సమస్య ఉన్నవారికి ఛాతీ నొప్పి లేదా గుండెల్లో మంట రావడం అనేది సాధారణ సమస్య. అలాంటి పరిస్థితుల్లో గ్యాస్ సమస్యలతో బాధపడేవారు కారం, గరం మసాలా, కాఫీని ఎక్కువగా తీసుకోకూడదు. అంతేకాదు వాల్‌నట్స్‌తో చేసిన నూనె, ప్రొటీన్లు అధికంగా ఉండే మటన్, చికెన్, గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ వంటి ఆహార పదార్థాలను చాలా తక్కువగా తినాలి. ఈ ఆహారం తీసుకుంటే అందులో ఉండే అదనపు కొవ్వు వారి జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది. అయితే, జీవనశైలి(Lifestyle) ఆహారంలో మార్పుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

తిన్న తర్వాత:

చాలా మంది తిన్న తర్వాత వెంటనే పడుకోవడం, లేదా కూర్చోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి మానుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తిన్న తర్వాత 10-15 నిమిషాలు నడవాలి. ఒక రోజులో కనీసం 10,000 అడుగులు నడవాలి. మీరు మీ రుచి, సామర్థ్యాన్ని బట్టి కొద్దికొద్దిగా తినడానికి ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Next Story