- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: ఇది చెత్త కేసు.. ఆ విషయం అధికారులకు కూడా చెప్పాను
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం తనపై పెట్టింది ఒక చెత్త కేసు అని.. ఆ విషయం విచారణ అధికారులకు కూడా చెప్పానని బీఆర్ఎస్(BRS) నేత కేటీఆర్(KTR) అన్నారు. గురువారం విచారణ అనంతరం తెలంగాణ భవన్‌తో మీడియాతో మాట్లాడారు. అసంబద్ధమైన కేసులో తనను ఎందుకు విచారిస్తున్నారో చెప్పాలని అధికారులను అడిగినట్లు చెప్పారు. ఇది రాజకీయ కక్షపూరిత కేసు అని.. ఈ విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ‘ఎవరికో పైసలు పంపాను.. అని నేనే చెబుతున్నాను. డబ్బులు వచ్చాయని వాళ్లు అంటున్నారు’ అని సెటైర్ వేశారు. అసలు ఇందులో అవినీతికి ఆస్కారం ఎక్కడుందో కూడా కనిపించడం లేదని అన్నారు. ‘కేవలం తనను జైలులో పెట్టి రాక్షాసానందం పొందాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చూస్తున్నారు. నన్ను జైల్లో పెట్టించాలని చూస్తే.. అది రేవంత్ రెడ్డి ఖర్మ’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డిది పరిమిత స్థాయి, పరిమిత జ్ఞానం అన్నారు. తనను ఏసీబీ అధికారులు 80కి పైగా ప్రశ్నలు అడిగారు. ఒక్కటి కూడా కొత్తది లేకుండా అడిగిన వాటినే మళ్లీ మళ్లీ.. తిప్పి తిప్పి అడిగారని మండిపడ్డారు. తాను గతంలోనే ఫార్ములా కేసులో బహిరంగ చర్చకు సిద్ధమని.. రేవంత్ రెడ్డి రావాలని పిలుపునిచ్చాను. ఇప్పుడు మరోసారి కూడా పిలుస్తున్నాను.. దమ్ముంటే లైవ్‌లో చర్చించేందుకు రావాలని సవాల్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలోనే కెమెరాలు ఏర్పాటు చేసుకొని చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు.