- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నెల రోజుల్లో కొత్త రోడ్లు మాయం!
దిశ, కారంపూడి: తారు రోడ్ల మరమ్మతుల్లో నాణ్యత లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మండలానికి కోటి ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు అయినట్లు ఆర్ అండ్ బి అధికారులు తెలిపారు. మరమ్మతులు చేపట్టిన కొద్ది రోజులకే అధ్వానంగా మారడంతో ప్రజలు పలు విమర్శలు చేస్తున్నారు. లక్ష్మి పురం ఆర్ అండ్ బి రోడ్డు నుండి పిన్నెల్లి వరకు రోడ్డు మరమ్మత్తులకు 15 లక్షలు మంజూరు కాగా ఎనిమిది లక్షల రూపాయలతో పనులు జరిగాయి. వేసిన రెండు రోజులకే అద్వానంగా తయారైంది. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడంతో నాణ్యత లోపించినట్లు తెలుస్తుంది.
ఒప్పిచర్ల జంక్షన్ నుండి లక్ష్మీపురం వరకు 60 లక్షల రూపాయలతో పనులు, నరామాల పాడు నుంచి శ్రీ చక్రం సిమెంట్ ఫ్యాక్టరీ వరకు 8 కిలో మీటర్ల వరకు 30 లక్షల రూపాయలకు నిధులు మంజూరు అయిన పని ప్రారంభించలేదు. అధ్వాన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. నెల రోజులు గడవక ముందే ప్యాచ్ రోడ్లు ఛిద్రం వడంతో పలువురు నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ రోడ్డును పరిశీలించి ఇంకా పెద్ద మొత్తంలో పాడవకుముందే పటిష్ట చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఆర్ అండ్ బి ఎ ఈ సుబ్బారావును ‘దిశ’ కారంపూడి రిపోర్టర్ వివరణ కోరగా మరమ్మతులు వేసిన రోడ్లు పరిశీలిస్తాము. అలాగే రైతులు రోడ్డుపై దమ్ము చక్రాలు తిరగడం వలన రోడ్లు తొందరగా చిధ్రమవుతున్నాయి. వీటిపై ఇప్పటికే మోటార్ వెకిల్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశాము. లోకల్ సీఐ కి తెలియజేశాము అని అన్నారు.