- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీసుల పనితీరుపై...ప్రజల ముందుకు పోలీసు శాఖ
దిశ, సిటీ క్రైమ్ : మీ అభిప్రాయాలకు మేము గౌరవిస్తామంటూ పోలీసు శాఖ సరికొత్తగా ప్రజల ముందుకు క్యూ ఆర్ కోడ్ స్కానర్ తో వచ్చింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని డీజీపీ జితేంద్ర ప్రారంభించారు. దీని ద్వారా పోలీసుల పనితీరు పై ప్రజల అభిప్రాయాలను నేరుగా స్కానర్ ద్వారా ఉన్నతాధికారులు తెలుసుకోనున్నారు. అదే విధంగా ప్రజల్లో పోలీసుల పనితీరు పై ఉన్న నమ్మకాన్ని ఉన్నతాధికారులు పోలీసులు తెలుసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు క్యూర్ కోడ్ స్కానర్ తో పోస్టర్ లను సిద్ధం చేశారు. ఈ పోస్టర్ లను ప్రతీ పోలీసు స్టేషన్ లో ఐదింటిని అందుబాటులో పెడతారు. పోలీసు స్టేషన్ కు వచ్చే పౌరులు ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ నమోదు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పాసుపోర్టు వెరిఫికేషన్, ఇంకా ఇతర పోలీసుకు సంబంధించిన సేవల పై వారు పొందిన అనుభూతిని ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వారి అభిప్రాయాలను తెలుపవచ్చు.
ఇలా స్కాన్ చేసిన అభిప్రాయాన్ని సిఐడి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగం సిటిజన్ ఫీడ్ బ్యాక్ కాల్ సెంటర్ నుంచి సేకరించి వాటిని ఉన్నతాధికారులకు అందిస్తుంది. పోలీసుల సేవల పారదర్శకత, జవాబుదారీతనంను ప్రజల్లో పెంచడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. అభిప్రాయాల సేకరణ ద్వారా పోలీసు సేవల పై లోపాలు ఉన్నా, ఫిర్యాదు లు ఉన్నా వాటిని మెరుగు పరుచుకుని పోలీసుల సేవలను మరింత సమగ్రవంతంగా ప్రజలకు అందించేందుకు ఉపయోగపడుతుందని పోలీసులు ఆశిస్తున్నారు. పోలీసు స్టేషన్ తో పాటు పోలీసు అధికారుల కార్యాలయాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.