గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

by Sridhar Babu |
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
X

దిశ,ఉప్పల్ : గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఉప్పల్ పోలీసు సిబ్బందితో కలిసి ఎక్సైజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఉప్పల్ ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ ఓంకార్ తెలిపిన వివరాల ప్రకారం మల్లాపూర్ కి చెందిన మదన్ రామ్ బీహార్ రాష్టం నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి అవసరమైన వారికి ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని విశ్వసనీయమైన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు దాడిచేసి మల్లాపూర్ ఎస్వీవీ నగర్ లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతడి వద్ద 2.520 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దాడిలో ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్ నరేష్ రెడ్డి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story