పుల్వామా విజయం మనందరిది: పాకిస్తాన్

by Anukaran |   ( Updated:2020-10-29 20:14:21.0  )
పుల్వామా విజయం మనందరిది: పాకిస్తాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మనం భారత్‌లోకి చొరబడి దాడి చేశాం. పుల్వామాలో విజయం మనందరిది. మీది. మాది. మన అందరిదీ. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానిది. మీరు, మేము కూడా ఆ విజయంలో భాగస్తులమే.’ ఈ వ్యాఖ్యలను చేసింది పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి. సాక్షాత్తూ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఫిబ్రవరిలో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన ఉగ్రవాద దాడి తమ విజయంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న విషయాన్ని బహిరంగంగా అంగీకరించినట్లియింది. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతోపాటు ఆ దేశ వ్యాప్తంగా పెద్ద దూమారం లేపాయి. పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మాట మార్చారు. ‘పుల్వామా ఘటన తర్వాత మనం భారత్ భూభాగంలోకి చొరబడి దాడి చేశాం.’ అని చెప్పడం తన ఉద్దేశమని తెలిపారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. తాము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించబోమని, అమాయకులను చంపబోమని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed