- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి’
దిశ ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ రాజ్యాంగ బద్ధంగా తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.రామరాజు, ప్రధాన కార్యదర్శి బండారి రమేష్, బజరంగ్ దళ్ కన్వీనర్ సుభాష్ చందర్‌లు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కమిషనర్ కార్యాలయం చట్టాలకు లోబడి ప్రజల కోసం పని చేస్తుందా?, ఎంఐఎం కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారా అని ప్రశ్నించారు.
దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో నగరంలోని పాత బస్తీలో లాక్‌డౌన్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. పాత బస్తీలో యథేచ్చగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘణలకు గురి కావడంతో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కరోనా వేగంగా విస్తరించి అనేక మంది ప్రజలు ప్రాణాలో కోల్పోయారన్నారు.
రంజాన్, బక్రీద్ పండుగల సందర్బంలో పోలీసులు దగ్గరుండి కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా సామూహిక ప్రార్ధనలు చేయించారని, గోహత్య నిషేద చట్టాన్ని అమలు చేయక పోవడంతో పాత బస్తీలో రోడ్లపైనే గోహత్యలు జరిగాయన్నారు. గణేష్ ఉత్సవాలు జరుపుకుంటామని చెప్పినప్పటికీ హిందువుల పట్ల వివక్ష చూపుతూ… అనేక చోట్ల దేవాలయాలకు తాళాలు వేశారని, గణేష్ మండపాలు బలవంతంగా తొలగించి భక్తులపై లాఠీ చార్జ్ చేయడం ద్వారా సీపీ మత విద్వేశాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో డీజీపీ జోక్యంచేసుకుని సీపీని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు.