బోనాలపై ఆంక్షలు విధించొద్దు: వీహెచ్‌పీ

by Shyam |
బోనాలపై ఆంక్షలు విధించొద్దు: వీహెచ్‌పీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: హిందువుల్లోని ఐక్యత, భక్తి భావాన్ని స్ఫురింపజేసే భోనాల పండగపై ఆంక్షలు విధించడం సరికాదని విశ్వహిందూ పరిషత్ అభిప్రాయ పడింది. కాచిగూడలోని శ్యాంబాబా మందిర్‌లో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామీజీ మాట్లాడుతూ ఒక వర్గం మెప్పు పొందడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం సరికాదని హితవు పలికారు. హిందువులంతా అతి పవిత్రంగా బోనాల ఉత్సావాలను నిర్వహిస్తారని, పండగలోనే వాతావరణాన్ని స్వచ్ఛపరిచే విధానముందని వివరించారు. ఇతర మతాల పండగల సమయంలో నజరానాలు, విందులు అందించిన ప్రభుత్వం హిందువుల పండగల విషయంలో వివక్ష చూపడం సరికాదన్నారు. ఈ సమావేశంలో శ్రీవిద్యాగణేశానంద భారతీ, త్రిదండి వ్రతాదాన్ నారాయణ రామానుజ జీయర్, వీహెచ్‌పీ ఆలిండియా మాజీ అధ్యక్షులు సి.రాఘవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, బండారి రమేష్, పగుడాకుల బాలస్వామి, శివరాం, భగవంత్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed