- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్ధవ్ ఠాక్రేను.. అయోధ్యకు ఆహ్వానించలేదు
దిశ, వెబ్ డెస్క్: మాహరాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేనా పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేపై పలు హిందూత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయోధ్య రామమందిర నిర్మాణానికి ఆయనను ఆహ్వానించడం లేదని విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ స్పష్టం చేశారు. హిందూత్వ పార్టీ అయిన శివసేను పలు హిందూత్వ సంఘాలే పక్కనబెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎంతో కృషి చేసిన శివసేన ఇప్పుడు చాలా మారిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ రామమందిర నిర్మాణానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు దేశంలోని మరేఇతర ముఖ్యమంత్రికీ ఆహ్వానం పంపించలేదని వీహెచ్‌పీ చీఫ్ అలోక్ కుమార్ అన్నారు. కాగా, అయోధ్యలో రామమందిర భూమి పూజ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని ఉద్ధవ్ థాక్రే కోరారు. చాలా మంది ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటున్నారని, దీంతో వారి ద్వారా కరోనా వ్యాప్తి చెందాలని భావిస్తున్నారా? అని ప్రశ్నలు గుప్పించారు. దీనిపై అలోక్ కుమార్ తీవ్రంగా స్పందించారు. చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అతిధులు హాజరవుతున్నారని.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే కార్యక్రామాన్ని నిర్వహిస్తారని స్పష్టం చేశారు.