రైతుల కష్టాన్ని వృథా కానివ్వం

by Shyam |
రైతుల కష్టాన్ని వృథా కానివ్వం
X

దిశ, వరంగల్ :
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు తగిన ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో తాగునీటి సమస్య, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ధాన్యం కొనుగోలు- గిట్టుబాటు ధర, వలస కూలీల సమస్యలపై హన్మకొండ నందన గార్డెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో గన్నీ బ్యాగుల కొరత తీవ్ర తరమవుతోందన్నారు. దీని నివారణకు జిల్లాలో గన్నీ బ్యాగుల ఫ్యాక్టరీ ఏర్పాటుకు కొందరు పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చారని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.అదే విధంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గోదాముల నిర్మాణానికి స్థలం కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేత మన చేతిలోనే ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి వైరస్‌ను తరిమికొట్టాలన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి కోరారు. విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా గతేడాది రైతు బంధుకు రూ.6000 కోట్లు ఇస్తే, ఈ ఏడాది రూ. 7000 కోట్లు ఇచ్చామన్నారు. రూ.25వేల లోపు ఉన్న రైతు రుణాలను ఒకే దఫాలో మాఫీ చేస్తున్నట్లు వివరించారు. తాగునీటి సమస్యపై త్వరలోనే సమగ్ర సమావేశం నిర్వహించి పట్టణంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed