వాటాల కోసం అమెరికా కంపెనీల చర్చలు

by Harish |   ( Updated:2020-09-03 03:24:18.0  )
వాటాల కోసం అమెరికా కంపెనీల చర్చలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన వైర్‌లెస్ (Wireless) సేవల సంస్థ వెరిజోన్ కమ్యూనికేషన్స్, ఈ-కామర్స్ (E-commerce) దిగ్గజ సంస్థ అమెజాన్ డాట్ ఇంక్ భారత్‌లోని వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌లో వాటాను కొనుకోలు చేసేందుకు సుమారు రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టవచ్చని తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ఏజీఆర్ (AGR) బకాయిల అంశంలో కోర్టు వ్యవహారాల్లో ఉన్నందున వొడాఫోన్ ఐడియా వాటా-అమ్మకాలకు సంబంధించిన చర్చలు వాయిదా పడ్డాయి.

దీనివల్ల సంస్థకు కొంత అనిశ్చితి ఏర్పడింది. అయితే, మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమెజాన్, వెరిజోన్ కమ్యూనికేషన్స్ తిరిగి చర్చలు ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై స్పందించేందుకు వొడాఫోన్ ఐడియా నిరాకరించగా, అమెజాన్, వెరిజోన్ సంస్థలు కూడా స్పందించలేదు. ఏజీఆర్ బకాయిల్లో భాగంగా వొడాఫోన్ ఐడియా ఇప్పటికే రూ. 7,854 చెల్లించింది. ఇంకా, రూ. 50,400 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఏజీఆర్ (AGR) బకాయిలను చెల్లించేందుకు టెలికాం కంపెనీల (Telecom companies)కు సుప్రీంకోర్టు 10 ఏళ్ల గడువుకు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశం కొలిక్కి రావడంతో వొడాఫోన్ ఐడియాలో వాటాలను కొనుగోలు చేసేందుకు విదేశీ దిగ్గజ కంపెనీ (Foreign iconic company)లు చర్చలను ప్రారభించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed