SBI బ్యాంకులో డీడీలు కావాలంటే పరిగెత్తాల్సిందే..

by Shyam |
SBI బ్యాంకులో డీడీలు కావాలంటే పరిగెత్తాల్సిందే..
X

దిశ‌, వెంక‌టాపురం : నెల‌ల త‌ర‌బ‌డి స్థానిక SBI బ్యాంకులో డీడీ (డిమాండ్ డ్రాప్ట్ ) ప్రింటింగ్ మిషిన్ రిపేర్‌కు వచ్చింది. దానికి మ‌ర‌మ్మ‌త్తులు చేయించడంలో బ్యాంకు అధికారులు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వస్తోంది. డీడీలు అవ‌స‌ర‌మైన రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కాంట్రాక్ట‌ర్లు, విద్యుత్ వినియోగ‌దారులు నానా అవస్థలు ప‌డుతున్నారు. గృహ విద్యుత్ మీట‌ర్ల కొర‌కు, రైతుల‌కు విద్యుత్ స్థంభాల ఏర్పాటుకు, గురుకులాలు, న‌వోద‌య విద్యార్థుల ప్ర‌వేశాల‌కు, రైతు బీమా, కాంట్రాక్ట‌ర్లు, ప్ర‌భుత్వ టెండ‌ర్‌ల‌కు బ్యాంకు డీడీల ద్వారానే సంబంధిత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. వెంక‌టాపురం ఎస్బీఐ బ్యాంకులో ప్రింట్ స‌క్ర‌మంగా రావ‌డం లేదు.

దీంతో డీడీలు అవ‌స‌ర‌మైన వారు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ములుగు జిల్లా కేంద్రం, ఏటూరు నాగారం త‌దిత‌ర స‌మీపంలోని బ్యాంకుల చుట్టు ప‌రిగెత్తాల్సిన ప‌రిస్థితి నెలకొందని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. డీడీల ఖ‌ర్చుకంటే మూడింత‌లు ర‌వాణా చార్జీల‌కు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంది. దీనికి తోడు రోజుల త‌ర‌బ‌డి బ్యాంకుల చుట్టు తిర‌గాల్సిన ప‌రిస్థితి నెల కొంది. ఇక‌నైనా బ్యాంకు ఉన్న‌తాధికారులు స్పందించి డీడీ ప్రింట‌ర్‌ కు రిపేర్లు చేయించాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఈ విష‌య‌మై బ్యాంకు సిబ్బందిని వివ‌ర‌ణ కోర‌గా గ‌త కొన్నినెల‌లుగా ప్రింటింగ్‌లో అక్ష‌ర దోశాలు వ‌స్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement

Next Story