- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోసం చేసింది చంద్రబాబే -మంత్రి వెల్లంపల్లి
దిశ, ఏపీ బ్యూరో: ఐదేళ్లుగా బెజవాడ నగరాన్ని అభివృద్ధి చేయకుండా ప్రజలను మోసం చేసింది చంద్రబాబేనని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం విజయవాడ స్వాతి సెంటర్ వద్ద క్యాంబే రోడ్డు, గాంధీ బొమ్మ సెంటర్లో దాదాపు రూ.4 కోట్లతో అభివృద్ది పనులకు శుంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు జలీల్ ఖాన్, బొండా ఉమా, గద్దె రామ్మెహనరావు, ఎం.పి కేశినేని నాని విజయవాడకు ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేని దద్దమ్మలని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వ హయంలో నగర అభివృద్ది పట్టించుకోని ఎంపీ ఇప్పడు దుర్గగుడి ఫ్లై ఓవర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కృష్ణా పుష్కరాలకు దుర్గగుడి ఫ్లై ఓవర్ పూర్తి చేస్తామన్న ఎంపీ కేశినేని నాని ఇప్పడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్దిని రెండు కళ్లుగా నగర అభివృద్దికి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.