ఓఆర్ఆర్‌పై వాహనాలకు అనుమతి

by Shyam |
ఓఆర్ఆర్‌పై వాహనాలకు అనుమతి
X

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌పై ఈ అర్ధరాత్రి నుంచి వాహనాలను అనుమతిస్తున్నట్టు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఈ నెల 20 ( బుధవారం అర్ధరాత్రి ) నుంచి వాహనాలను అనుమతించాలని హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఓఆర్​ఆర్​పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(హెచ్​ఎండీఏ), హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లి.(హెచ్​జీసీఎల్​) నిర్ణయించాయి. ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్​ఆర్​పై టోల్​గేట్​ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని హెచ్ఎండీఏ సూచించింది. ఓఆర్​ఆర్​ టోల్​ ప్లాజాల వద్ద ఫాస్ట్‌టాగ్​ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్​ పేమెంట్​ పద్ధతిలో ఫాస్ట్​‌టాగ్​​ చెల్లింపులకు అవకాశం ఉంటుందని, వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్​ఎండీఏ పేర్కొంది. కర్ఫ్యూ అమలులో ఉన్న వేళల్లో (రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు) ఓఆర్​ఆర్​పై కార్లను అనుమతించరు. ఓఆర్​ఆర్​పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్​ వెహికిల్స్​)లో ప్రయాణికులను తరలించకూడదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed