మరోసారి మెగా ప్రిన్స్‌తో అందాల రాక్షసి

by Shyam |
మరోసారి మెగా ప్రిన్స్‌తో అందాల రాక్షసి
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో మరోసారి జతకట్టనుంది సుట్టబొగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో లావణ్య వరుణ్‌ హీరోయిన్‌గా కనిపించగా… మరోసారి ఈ హిట్ కాంబినేషన్ తెరపై అలరించబోతోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో వరుణ్ హీరో కాగా… సయీ ముంజ్రేకర్ కథానాయికగా పరిచయం కాబోతోంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు అవకాశం ఉందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే పాత్ర కోసం మరో భామ కోసం వెతుకుతున్నారట డైరెక్టర్. సినిమాకు కీలకమైన ఈ పాత్ర కోసం అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని ఎంచుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.

‘అర్జున్ సురవరం’ సినిమాతో లేటెస్ట్ హిట్ అందుకున్న లావణ్య త్రిపాఠి… తమిళ్‌లో హీరో అథర్వకు జోడీగా సెలక్ట్ అయింది. ఈ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంటర్ కాబోతోంది. ఇదిలా ఉంటే ‘వకీల్ సాబ్’ చిత్రంలోనూ లావణ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం.

Tags: Varun Tej, Lavanya Tripati, Anthariksham, Vakeel Saab

Advertisement

Next Story