- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరవరరావు విడుదల కోసం కూతుళ్ల లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో
ప్రముఖ విప్లవ కవి వరవరరావును జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ ఆయన కూతుళ్లు సహజ, అనల, పవన మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, అక్కడి హైకోర్టు న్యాయమూర్తికి గురువారం లేఖ రాశారు. వరవరావు వయసు 80ఏండ్లకు పైగా ఉందని, ఆయన ఉంటున్న జైలులోని ఓ ఖైదీ కరోనాతో మరణించారని గుర్తు చేస్తూ పెరోల్‌పై విడుదల చేయాలని కోరారు. రాజ్యాంగంలోని అధికరణ 21 విచారణలో ఉన్న ఖైదీలకు జీవించే హక్కు కల్పించిందని, ఆయనపై నిరాధార నేరారోపణలు చేశారని లేఖలో స్పష్టం చేశారు. వరవరరావును విడుదల చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పీసీఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, ఐజేయూ అనుబంధ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, తెంజూ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, టీయూడబ్ల్యూజే నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.యోగనంద్, యార నవీన్ కుమార్, తెంజు హైద్రాబాద్ నగర అధ్యక్షుడు జి.సంపత్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో సంభవిస్తున్న మరణాల దృష్ట్యా వరవరరావుతో పాటు జైళ్ళలోని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.