వరలక్ష్మి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

by srinivas |
వరలక్ష్మి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
X

దిశ, వెబ్‎డెస్క్ :
విశాఖలో జరిగిన వరలక్ష్మి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలి శరీరంపై ఐదు గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మెడతో పాటు చేతులపై బ్లేడ్ తో కోసినట్టు గాయాలు ఉన్నాయి. ఎడమచేతి మణికట్టు తెగిపోయింది. కాగా, నిందితుడు అఖిల్ గత చరిత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. అఖిల్ కణితిరోడ్ పాన్ షాపులో బ్లేడ్ కొనగా.. ఓ కిరాణా షాపులో కారం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మిని ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Next Story