- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బార్లీ కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం !
దిశ, వెబ్ డెస్క్ : బార్లీ మన ఆరోగ్యానికి చాలా మేలును చేస్తాయి. బార్లీతో మన ఒంట్లో వేడిని కూడా తగ్గించుకోవచ్చు. అలాగే బార్లీతో కొత్త వంటకాలు కూడా ట్రై చేయవచ్చు. అవి ఏంటంటే బార్లీ కిచిడి. ముందుగా ఈ రెసిపీకు కావలిసిన పదార్ధాలను, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
బార్లీ కిచిడి తయారీ విధానం
కావలిసిన పదార్ధాలు :
కంది పప్పు - 1 కప్పు
బార్లీ - 1 కప్పు
1 టీ స్పూన్ - ఇంగువ
1 టీ స్పూన్ - జీలకర్ర
పచ్చి మిర్చి - 2
ఉల్లిపాయ - 1 (చిన్నది )
పసుపు - చిటికెడు
ఉప్పు - సరిపడినంత
తయారీ విధానం :
ముందుగా పప్పు, బార్లీని కడిగి నీటిలో నానబెట్టుకోవాలి . ఆ తరువాత పాన్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి , దానిలో నెయ్యి వేసి అది వేడయ్యే వరకు ఉంచుకోవాలి. వాటిలో కొంచం ఇంగువ, జీల కర్ర వేసి వాటిని 10 నుంచి 15 సెకన్ల వరకు బాగా వేగనివ్వండి. ఆ తరువాత ఆ మిశ్రమంలో కొన్ని పచ్చి మిర్చి , కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని రంగు మారే వరకు కొంచం సేపు ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌లో 3 కప్పుల నీరు తీసుకోని వాటితో పాటు ఉప్పు, పసుపుతో పాటు బార్లీ, పప్పుని వేసుకోవాలి. ఇప్పుడు సన్నని మంట మీద 10 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని బాగా ఉడికించాలి. 1 విజిల్ వచ్చే వరకూ ఉంచి దించుకోవాలి. అంతే వేడి వేడి బార్లీ కిచిడి రెడీ.