ఆగస్టు 16న వైష్ణో దేవి ఆలయం ఓపెన్.. కానీ

by Shamantha N |
ఆగస్టు 16న వైష్ణో దేవి ఆలయం ఓపెన్.. కానీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా, లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో ప్రముఖ దేవాలయాలు సైతం మూతపడ్డ విషయం తెలిసిందే. అటు కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము-కశ్మీర్‌లో ఇవే ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే, ఈ నేపథ్యంలోనే సడలింపులో భాగంగా భక్తుల కోరిక మేరకు జమ్ములో ఆగస్టు 16 నుంచి దేవాలయాలు, ప్రార్థన మందిరాలు తెరుచుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్‌లోనే ప్రముఖ దేవాలయం శ్రీ మాత వైష్ణో దేవి ఆలయం కూడా 16వ తేదీన తెరుచుకోనుంది. దేశం నలుమూలల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. పైగా ఇక్కడ అంతా పర్యాటక ప్రాంతం అవడంతో సందర్శకుల తాకిడి అధికంగానే ఉంటుంది.

వీటిని పరిగణలోకి తీసుకున్న అక్కడి ప్రభుత్వం వైష్టో దేవి ఆలయానికి రోజుకి 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అక్కడి ఉన్న చిరు వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా తామంతా నష్టపోయామని.. ఈ నిర్ణయంతో కొద్దిగా తమ వ్యాపారాలను సాగిస్తామని అక్కడి వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed