దేశంలో టీకా తీసుకోవడం స్వచ్ఛందం: కేంద్ర ఆరోగ్య శాఖ

by Shamantha N |
దేశంలో టీకా తీసుకోవడం స్వచ్ఛందం: కేంద్ర ఆరోగ్య శాఖ
X

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్-19కు టీకా తీసుకోవడం పూర్తిగా స్వచ్ఛందమని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. దేశంలో ప్రవేశపెట్టబోయే వ్యాక్సిన్ ఇతర దేశాలు అభివృద్ధి చేసిన టీకా మాదిరిగా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది. గతంలో కొవిడ్-19 సోకిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా టీకా రెండు డోసులు తీసుకోవాలని, ఎందుకంటే ఇది వ్యాధికి వ్యతిరేకంగా బలమైన రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో సహాయ పడుతుందని పేర్కొంది. రెండో డోసు తీసుకున్న రెండు వారాల తర్వాతనే యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేసింది. గురువారం వరకు కొవిడ్-19 టీ‌కాకు సంబంధించి తరుచూ ఎదురవుతున్న ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్యశాఖ సమాధానాలు ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed