ఆయన సత్తా ఉన్న నటుడు: వాణి

by Shyam |
ఆయన సత్తా ఉన్న నటుడు: వాణి
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ కెరియర్‌లో ‘బెల్ బాటమ్’ ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో వాణి కపూర్ అక్షయ్‌కు జోడీగా నటించింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించిన వాణి.. అక్షయ్‌తో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.

ఏ జోనర్ సినిమా అయినా వంద శాతం న్యాయం చేయగలిగే సత్తా ఉన్న నటుడు అక్షయ్ అని.. యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ ఏదైనా సరే బెస్ట్ ఇవ్వగలరని చెప్పింది. సూపర్ స్టార్ అక్షయ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని గ్రేట్‌గా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. టాలెంటెడ్, ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్ అక్షయ్ ప్రతీ విషయాన్ని అబ్జర్వ్ చేస్తారని, అందులో నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటారని చెప్పింది.

అక్షయ్ సెట్‌లో అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాడన్న వాణి.. దయగలిగిన, అద్భుతమైన వ్యక్తి అని ప్రశంసించింది. టైమ్ దొరికితే హోటల్ రూమ్‌కు వెళ్లి గడపడమే తప్ప, సెట్‌లో తను ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వనని.. కానీ అక్షయ్ అందరితో కలిసి భోజనం చేయడం, కుటుంబం గురించి మాట్లాడటం చేస్తుంటారని చెప్పింది. బెల్ బాటమ్ సెట్స్‌లో అలాగే ఉండేవాళ్ళమని.. ఆ మెమొరీస్ లైఫ్ లాంగ్ గుర్తుంటాయని తెలిపింది భామ.

ప్రస్తుతం చంఢీగర్‌లో ‘చంఢీగర్ కరే ఆషికీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది వాణి కపూర్. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరో కాగా, వాణి ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించబోతుందని టాక్.

Advertisement

Next Story