శ్రీదేవసేనను కలిసిన యూటీఎఫ్​ నాయకులు

by Shyam |
శ్రీదేవసేనను కలిసిన యూటీఎఫ్​ నాయకులు
X

దిశ, న్యూస్​బ్యూరో: పాఠశాల విద్య నూతన కమిషనర్ శ్రీదేవసేనను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్​యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదికను ఈ సందర్భంగా కమిషనర్​కు అందజేసి, కోవిడ్ ఉధృతి నేపథ్యంలో విద్యారంగం పరిస్థితిపై చర్చించారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల అధికారాలపై త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని మెమోరాండం అందించారు.

Advertisement

Next Story