- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేసే బదులు దానిపై దృష్టి పెట్టండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆర్మీ వ్యతిరేక ప్రకటనలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి, రిటైర్డ్ ఆర్మీ అధికారి వీకే సింగ్‌ను పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్ర మంత్రులను తొలగించే అంశాన్ని ప్రధాని చూసుకుంటారని స్పష్టంచేసింది. పిటిషనర్‌ను ఉద్దేశిస్తూ ‘మీరు ఇలాంటి పిటిషన్లు వేసే బదులు, దేశ సేవపై దృష్టిపెడితే బాగుంటుంది’ అంటూ హితబోధ చేసింది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా సరిహద్దు రేఖపై వీకే సింగ్ మాట్లాడుతూ.. ‘చైనాతో మన సరిహద్దు ఇప్పటికీ గుర్తించబడలేదు. చైనా చెప్పినట్టే కొంతకాలంగా ఆక్రమణలు జరిగాయి. మనం ఎన్నిసార్లు ఆక్రమించామో మీకు చెప్పలేను. కానీ, చైనా పదిసార్లు ఆక్రమిస్తే, మనం కనీసం 50సార్లైనా ఆక్రమించి ఉంటాం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
చైనా ఆరోపణలకు ఈ ప్రకటన బలాన్నిచ్చినట్టయింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఉద్రిక్తతలకు కారణం భారతేనంటూ విరుచుకుపడింది. ఈ క్రమంలో వీకే సింగ్ వ్యాఖ్యలపై చంద్రశేఖరన్ రామస్వామి అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. భారత సైన్యంలో రిటైర్డ్ ఫోర్-స్టార్ జనరల్ అయిన వీకే సింగ్.. ‘మంత్రి పదవిలో ఉండి చేసిన వ్యాఖ్యలు నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయి. చైనాకు ఆయుధంగా మారాయి. ప్రపంచం దృష్టిలో భారత్‌పై చెడు అభిప్రాయం ఏర్పడేలా చేశాయి’ అంటూ పేర్కొన్నారు. ఈ పిల్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషన్ దారుడికి మొట్టికాయలు వేసింది. ‘మంత్రి అలాంటి స్టేట్‌మెంట్ ఇస్తే.. అతణ్ని తీసేయాలని పిల్ వేయడమేనా’ అంటూ ప్రశ్నించింది. ‘ఇలాంటి పిటిషన్లు వేసే బదులు, మీ దృష్టిని దేశ సేవపై పెట్టండి’ అంటూ హితబోధ చేసింది. పిల్‌ను డిస్మిస్ చేసింది.
- Tags
- petition