- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ
దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఓ వైపు ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతుంటే, మరోవైపు కొవిడ్-19 వ్యాప్తి విజృంభిస్తోంది. అమెరికాలో కేవలం 24 గంటల్లో 91 వేల కేసులు నమోదవడం చూస్తే కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. అమెరికాలో తొలి కరోనా నమోదైనప్పటి నుంచి ఒక్కరోజులో 90 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. అక్టోబర్ నెల రెండో వారం నుంచి అమెరికాలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతోంది.
ఎన్నికలు దగ్గరపడుతున సమయంలో కేసులు పెరుగుతుండటం అమెరికన్లలో ఆందోళన పెరుగుతోంది. జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం..24 గంటల వ్యవధిలో 91,295 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 89.4 లక్షలకు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలో నమోదయ్యాయి. సెప్టెంబర్ వరకు కేసులు తగ్గుతున్నట్టు కనిపించినప్పటికీఎ అక్టోబర్‌లో అనూహ్యంగా పెరిగాయి. గత వారం వరకు రోజుకు 50 వేల పరిధిలో నమోదైన కేసులు ఇప్పుడు సగటున 75 వేలు నమోదవుతున్నాయని యూనివర్శిటీ తెలిపింది.