ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకం..!

by vinod kumar |
ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకం..!
X

దిశ, వెబ్‎డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కరోనా బారినపడ్డ ట్రంప్‎కు వెంటిలేటర్‎పై చికిత్సను అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మిలటరీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 74 ఏళ్ల వయసున్న ట్రంప్.. స్థూలకాయం, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు.

కాగా, తన ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్‎లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. రాబోయే రెండు, మూడు రోజులు అసలు పరీక్ష అని అన్నారు. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఎన్నికల ముందు ట్రంప్ కరోనా బారిన పడడంతో డెమొక్రాట్లు ఆందోళనలో ఉన్నారు. నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed