ఆస్పత్రిలో చేరిన డొనాల్డ్ ట్రంప్

by vinod kumar |
ఆస్పత్రిలో చేరిన డొనాల్డ్ ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దంపతులు శుక్రవారం కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యి, చికిత్స పొందుతున్నారు. ఆయనకు డాక్టర్లు ప్రయోగాత్మకంగా కోవిడ్ ట్రీట్ మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే తాను బాగానే ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. ఆసుపత్రిలో ఆయన కొన్నిరోజులు ఉండే అవకాశం ఉందని ప్రెస్ సెక్రటరీ కేలీ మెక్ ఎనానీ తెలిపారు. ఆయనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేలీ చెప్పారు. శుక్రవారం వైట్ హౌస్‌లో రికార్డు చేసిన వీడియోలో.. ట్రంప్ తన హెల్త్ గురించి వెల్లడించారు.

Advertisement

Next Story