అమెరికా ఆర్థికాన్ని బలోపేతాం చేశాం : అధ్యక్షుడు ట్రంప్

by Shamantha N |
అమెరికా ఆర్థికాన్ని బలోపేతాం చేశాం : అధ్యక్షుడు ట్రంప్
X

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్‌లో ప్రసంగిస్తూ.. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాక అమెరికా ఆర్థిక వ్యవస్థను వేగంగా బలోపేతం చేశామన్నారు. రికార్డు స్థాయిలో పన్ను సంస్కరణలు చేపట్టామని తెలిపారు. ఉద్యోగాల కోసమూ తగిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గత 50ఏళ్లతో పోలిస్తే నిరుద్యోగం కనిష్ట స్థాయికి చేరిందని వివరించారు. తమ హయాంలో మూడేళ్లలో 30 లక్షల మంది ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. ఇంధన ఉత్పత్తిలో అమెరికా నంబర్ వన్ స్థానంలో ఉన్నదని అన్నారు. దేశ మిలిటరీకి పెద్దపీట వేశామని చెప్పారు. అమెరికాలో నిరుద్యోగానికి కారణమైన చైనాపై నియంత్రణ తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పుడు స్వదేశీ కంపెనీలు విదేశాలకు వెళ్లడం లేదని వివరించారు. మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం వేగంగా జరుగోతందని అన్నారు. ఐఎస్ వ్యవస్థాపకుడు అల్ బగ్దాదీని హతమార్చినట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story