- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi : ఢిల్లీలో భారీ వర్షం.. ఆరెంజ్ అలర్ట్ జారీ
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. దీంతో ఉష్ణోగ్రతలు భారీ పడిపోయాయి. ఉదయం నుంచి ప్రారంభమైన వర్షం రోజు మొత్తం కురిసింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు వడగండ్ల వాన కురిసే చాన్స్ ఉందని హెచ్చరించింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ఢిల్లీలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ‘ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్తాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది’ అని ఐఎండీ తెలిపింది. నేడు(శనివారం) హిమాలయ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం, మంచు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో చలి వణికిస్తోంది.