మన్మోహన్ సింగ్ సేవలు మరువలేనివి

by Sridhar Babu |
మన్మోహన్ సింగ్ సేవలు మరువలేనివి
X

దిశ, గోదావరిఖని : భారతదేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విశిష్ట సేవలు అందించారని, ఆయనకు మరణం లేదని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ అన్నారు. శుక్రవారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఆర్థిక వేత్తగా, ఆర్బీఐ గవర్నర్ గా, దేశ ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సేవలందించారని కొనియాడారు. దేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో తన ఆలోచనా విధానంతో అనేక సంస్కరణలు చేపట్టి దేశాన్ని కాపాడారన్నారు. కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు అందించి రెండుసార్లు భారత ప్రధాని ఆయ్యారన్నారు.

వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మహంకాళి స్వామి, కొలిపాక సుజాత, పాతపల్లి ఎల్లయ్య, దాతు శ్రీనివాస్, దీటి బాలరాజు, పెద్దల్లి ప్రకాష్, మారెల్లి రాజిరెడ్డి, తిప్పారపు శ్రీనివాస్, నాయిని ఓదెల యాదవ్, గట్ల రమేష్, కొప్పుల శంకర్, బొమ్మక రాజేష్, సింహాచలం, దాసరి సాంబమూర్తి, ఆసిఫ్ పాషా, యుగంధర్, గడ్డం శ్రీనివాస్, యాకూబ్, మాలేం మధు, హనుమ సత్యనారాయణ, అల్లి శంకర్, ఇండ్ల ఓదెలు, మోహిద్ సన్నీ, కలవల రంజిత్, కృష్ణ, గుమ్మడి రవి, గఫూర్, అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed