- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొర్రుర్ నుంచి హైదరాబాద్ రూట్ లో బస్సులను పెంచండి
దిశ, తిరుమలగిరి: తిరుమలగిరి నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత ఉప్పల్,హైదరాబాద్ రూట్లలో బస్సులు లేక ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బస్సుల సంఖ్య పెంచాలని కోరుతూ తొర్రురు ఆర్టీసీ బస్ డిపోలో ఆర్టీసీ కంట్రోలర్ కు బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో..వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తిరుమలగిరి నుంచి హైదరాబాద్ రూట్లో సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కేవలం రెండు ఎక్స్ ప్రెస్,ఒక సూపర్ డీలక్స్ వస్తున్నాయని, గతంలో 20నిమిషాలకొక బస్సు ఉండేదని, బస్సుల కుదింపు వల్ల ప్రయాణికులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారని వారికి దృష్టికి తీసుకెళ్లామన్నారు. సాయంత్రం సమయంలో మరో 2 బస్సులను పెంచే విధంగా చర్యలు చేపట్టాలని కోరగా.. ఆయన ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.