Dangerous Train Journey : వామ్మె ఇదేమి జర్నీ..రైలు చక్రాల మధ్య 290కి.మీ ప్రయాణ దుస్సాహసం !

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-27 11:45:49.0  )
Dangerous Train Journey : వామ్మె ఇదేమి జర్నీ..రైలు చక్రాల మధ్య 290కి.మీ ప్రయాణ దుస్సాహసం !
X

దిశ, వెబ్ డెస్క్ : మనుషులు ఈ రకంగా కూడా ప్రయాణిస్తారా అన్నట్లుగా ఓ వ్యక్తి(Man) చేసిన రైలు ప్రయాణం(Dangerous Train Journey) సంచలనంగా మారింది. అత్యంత దుస్సాహసంగా ఎక్స్ ప్రెస్ రైలు చక్రాల మధ్య వేలాడుతూ అతను చేసిన ప్రయాణం అందరిని విస్మయపరిచింది. అలా అతను ఎక్స్ ప్రెస్ రైలు చక్రాల మధ్య ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 290కిలో మీటర్లు ప్రయాణించాడు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు విస్మయానికి గురవ్వడంలో అతిశయోక్తి లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ (Danapur Express train ,Jabalpur, Madhya Pradesh)కింద చక్రాల మధ్య దాక్కున్న వ్యక్తి ఇటార్సీ నుండి జబల్‌పూర్(Itarsi ,Jabalpur) వరకు 290 కిలోమీటర్ల పాటు చక్రాల మధ్య వేలాడుతూ ప్రయాణించాడు. జబల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు రోలింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో S-4 కోచ్ కింద ఒక వ్యక్తి కనిపించాడు. రైల్వే సిబ్బంది బోగీ అండర్ గేర్(Bogie under gear) తనిఖీ చేస్తుండగా, ట్రాలీలో పడి ఉన్న అతడిని గుర్తించారు. రైలు ఆగిన స్టేషన్ లో రైల్వే ఉద్యోగులు రోలింగ్ పరీక్ష చేస్తుండగా చక్రాల మధ్య ఉన్న అతడిని గుర్తించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)(Railway Protection Force (RPF)) అధికారులకు సమాచారం అందించారు.

పోలీసుల పిలుపుతో తాపీగా బయటకు వచ్చిన అతడిని చూసి ఉద్యోగులు , రైల్వే ప్రయాణికులు ఇదేమి జర్నీ బాబు అనుకుంటూ అవాక్కయ్యారు. చక్రాల మధ్య ప్రయాణంతో ఆ వ్యకి బట్టలు, నెత్తి దుమ్ముపట్టాయి. అతను ఇటార్సీ నుండి రైలు ఎక్కినట్లు అంగీకరించినప్పటికీ, రైలు ట్రాలీలోకి ఎలా ప్రవేశించాడనే వివరాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనకు సంబంధించి ఆర్పీఎఫ్ అధికారులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతను ఆ విధంగా ప్రమాదకర ప్రయాణం చేయడం వెనుక ఉన్న అసలు విషయాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed