పరిసరాలను శుభ్రం చేయాలని కోర్టు శిక్ష

by Naveena |
పరిసరాలను శుభ్రం చేయాలని కోర్టు శిక్ష
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 27: బోధన్ పట్టణంలో 8 మంది నిందితులకు ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ లో భాగంగా కోర్టు ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయించారు. బోధన్ పట్టణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులు, రాకాసిపేట్ లోని గోసంగి కాలనీలో గొడవపడిన కేసులో ఐదుగురు వ్యక్తులను బోధన్ ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేషతల్పసాయి ముందు ఎనిమిది మందిని హాజరుపరచడంతో..మేజిస్ట్రేట్ వారికి ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ కింద కోర్టు ఆవరణలో పరిసరాలను శుభ్రం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు ఉత్తర్వులను అమలు పరిచినట్లు ఎస్ హెచ్ ఓ వెంకట్ నారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed