- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీకా సప్లైకి ‘సీరం’తో యూఎస్ సంస్థ ఒప్పందం
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుల్లో ఒకటైన పూణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)తో అమెరికా ఫార్మా సంస్థ టీకా సప్లై కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రా జెనెకాలు టీకా తయారీ కోసం ఇది వరకే ఎస్ఐఐతో డీల్ చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ నెలాఖరులోగా ఈ టీకాపై క్లినికల్ ట్రయల్స్‌ను సీరం ప్రారంభించబోతున్నది.
ఈ టీకా మూడో దశ ట్రయల్స్ కూడా విజయవంతమైతే ఇండియాలో ‘కొవిషీల్డ్’ బ్రాండ్‌నేమ్‌తో ఎస్ఐఐ అందుబాటులోకి తేనుంది. ఇదిలా ఉండగా, తాజాగా, అమెరికా ఫార్మా సంస్థ నోవావాక్స్, ఎస్ఐఐతో సప్లై, లైసెన్స్ అంగ్రీమెంట్ ఒప్పందాలను చేసుకుంది. టీకా అభివృద్ధి, కోఫార్ములేషన్, రిజిస్ట్రేషన్, కమర్షియలైజేషన్‌లపై సీరంతో గతనెల 30న ఒప్పందం చేసుకున్నట్టు నోవావాక్స్ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్‌కు చేసిన ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ ఒప్పందంతో భారత్‌లో నోవావాక్స్ టీకాపై సీరంకు ప్రత్యేక హక్కులుంటాయి. ఆర్థికంగా వెనుకబడి దేశాల్లోనూ ఈ టీకాపై ప్యాండమిక్ పీరియడ్ కాలంలో సీరంకు సాధారణ హక్కులుంటాయి. తొలి దశ ట్రయల్స్‌లో ఈ టీకా విజయవంతంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేయగలిగిందని మంగళవారమే నోవావాక్సిన్ ప్రకటించడం గమనార్హం.
కరోనా నుంచి రికవరీ అయినవారిలో కంటే ఆరోగ్యవంతుల్లో రెండు డోసుల ఈ టీకాతో యాంటీబాడీలు ఎక్కువగా కనిపించాయని ఈ కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ ఆఖరు వరకు ఈ టీకా మూడో దశ ట్రయల్స్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వివరించింది. 2021కల్లా 100 నుంచి 200 కోట్ల డోసులను ఉత్పత్తి చేసే టార్గెట్ పెట్టుకున్నట్టు పేర్కొంది.