- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊర్వశి రౌతెలా సేవలకు కేంద్ర పురస్కారం
X
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ‘స్త్రీ శక్తి జాతీయ పురస్కారం’ అందుకుంది. వివిధ రంగాల్లో చేసిన అసాధారణ సేవలకుగాను మహిళలకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఈ అవార్డును అందిస్తుండగా.. ఈ పురస్కారం అందుకున్న అతిచిన్న వయస్కురాలిగా ఊర్వశి రికార్డ్ సృష్టించింది. మహారాష్ట్ర, గోవా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆమె.. ‘నా దేశంలో నేను గర్వించే క్షణమిది’ అని తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో ఆహారం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించిన ఊర్వశి.. అంతకు ముందు ముంబైలో తుఫాన్ సమయంలో నిరాశ్రయులకు చేయూతనిచ్చింది. ఈ సేవలను గుర్తించిన కేంద్రం ‘స్త్రీ శక్తి జాతీయ పురస్కారం – 2021’తో ఊర్వశిని గౌరవించింది.
Advertisement
Next Story