- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉత్సవాలకు ముస్తాబైన ఊరుకొండ
దిశ, కల్వకుర్తి: నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలోని అతి పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. ఈ నెల 6 నుంచి 12 వరకు బ్రహోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయం కల్వకుర్తి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి మహోత్తరమైన చరిత్ర ఉందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయానికి రెండు వైపులా ఎత్తైన కొండలు ఉండటం వలన “ఊరుకొండ” అని పేరు వచ్చినట్లు గ్రామస్తులు చెబుతారు. ఊరుకొండపేట గతంలో సిరి సంపదలతో తులతూగుతూ గొప్ప వ్యాపార కేంద్రంగా విరసిల్లిన ప్రాంతంగా ప్రజలు చెప్పుకుంటారు.
పురాతన చరిత్ర..
భోజరాయలు శివున్నీ ఆరాధించేవారు. గట్టు ఇప్పలపల్లిలో కాళికాదేవితో పాటు పంచలింగాలను ప్రతిష్టించారు. వీరు మధ్య సాంప్రదాయకులు కాబట్టి ఆ గ్రామంలో ఆంజనేయస్వామి ప్రతిమను ప్రతిష్ఠించాలని వెతుకుతూ వచ్చి ఊర్కొండపేటపై శిలను గుర్తించారు. విగ్రహాన్ని చెక్కి మంచి ముహూర్తం చూసుకుని మూల విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా బండ్లు విరిగిపోయాయి. స్వామివారిని ఎంతమంది వచ్చి లేపినా విగ్రహం లేవలేదని నానుడి కలదు. శిల్పికి వచ్చిన కలలో స్వామివారు ఇక్కడనే ప్రతిష్టించాలని చెప్పారని, అందుకని ఊరుకొండపేట గ్రామ ప్రజలందరూ ఆంజనేయస్వామి వారికి దేవాలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. స్వామివారి ప్రతిమ ఆరు అడుగులు ఉండి కాళికావర్చస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. మరెక్కడా లేని విధంగా సింధూర లేపనం లేకుండా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. ఎత్తైన గర్భగుడి కలిగి విశాలమైన ప్రాకారాలతో, సత్రములతో చూపరులకు ఆలయ సముదాయం రాజుల దర్బార్ వలె కనిపిస్తుంది.
ఏటా బహుళ అమావాస్య తిథిలో..
ఊరుకొండలోని స్వామివారికి ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య తిథులలో ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, వాహనాలు తెచ్చి శోభాయమానంగా అలంకరిస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పురవీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. ఇక్కడి రథం పూర్తిగా ఇనుముతో చేయబడి ఉంటుంది. 12 ఏండ్లుగా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిస్తున్నారు. కొండపై గుండం వద్ద స్వామివారి పాదముద్రలు ఉన్నాయి. నిత్యం భక్తులు కొండపైకి వెళ్లి గుండంలో స్నానాలు చేస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల చేసిన పాపాలు హరించుకు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. స్వామివారికి ప్రతీ ఏడాది పుష్యమాసం చివరి శనివారం శకటోత్సవంతో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి.
పూజా కార్యక్రమాలు
ఫిబ్రవరి 6న ఉదయం ఊరుకొండ పేట అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో మంగళ వాయిద్యాలతో ఆలయానికి తీసుకొస్తారు.
7న రాత్రి పంచ సూక్తాలతో పూజలు, స్వామివారికి గజావాహన సేవలు, భోజనాలు, ప్రదోష పూజలు కార్యక్రమాలు ఉంటాయి.
8న రాత్రి పూజలు, రథోత్సవం నిర్వహిస్తారు. పంచసూక్తాలతో పూజలు రథోత్సవం.
9న హరికథా కాలక్షేపం, పల్లకి సేవా
10న మధ్యాహ్నం పాలతో పంచామృతాభిషేకం, అష్టోత్తర పూజలు, రాత్రి ఒంటె వాహన సేవా, తీర్థ ప్రసాదాలు వితరణ.
11న నిత్య పూజలు, రాత్రికి నెమలి వాహన సేవ, గ్రామ భజన మండలితో భజనలు.
12న రాత్రికి నిత్య పూజలు, పల్లకి సేవ కార్యక్రమాలు ఉంటాయి.
13న చక్రతీర్థ స్నానం, స్వామివారి అభిషేకం, అష్టోత్తర నామాలు, మంత్ర పుష్పం, సాయంత్రం 7గంటలకు ఉత్సవ విగ్రహం దేవాలయం నుంచి ఊరుకొండ పేట అర్చకుల ఇంటికి మంగళ వాయి.
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం
ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
– ఈవో రామేశ్వర శర్మ