- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సివిల్ సర్వీసెస్ పరీక్షల తేదీలు విడుదల
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలు 2020, ఇంటర్వ్యూలకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) విడుదల చేసింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం.. యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్, ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్షలు అక్టోబర్ 4వ తేదీన జరుగుతాయి. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 8న ఐఎఫ్ఎస్ ‘మెయిన్స్’ ఫిబ్రవరి 28న ఉంటాయి. సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పర్సనాలిటీ టెస్టు 2019 పరీక్షలు రాయాల్సి ఉన్నవారు జూలై 20న రాయవచ్చు. మే 31న జరగాల్సి ఉన్న ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను కొవిడ్ 19 కారణంగా యూపీఎస్‌సీ మే 4న వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పరీక్షల తేదీలను ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(upsc.gov.in)లోకి వెళ్లి సవరించిన షెడ్యూల్‌ను పరిశీలించవచ్చునని, పరీక్షలకు ముందు అడ్మిట్ కార్డులను అందులో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూపీఎస్‌సీ తెలిపింది. కాగా, వీటితోపాటు ఎన్‌డీఏ, ఎన్ఏ పరీక్షలు(I), ఎన్‌డీఏ, ఎన్ఏ పరీక్షలు(II) 2020 పరీక్షలు సెప్టెంబర్ 6వ తేదీన జరుగుతాయని యూపీఎస్‌సీ సర్క్యూలర్ ప్రకటించింది. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామ్/ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్ అక్టోబర్ 16న, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 22న, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(ఏసీలు) పరీక్షలు డిసెంబర్ 20వ తేదీన నిర్వహించనున్నట్టు తెలిపింది. కాగా, ఐఈఎస్, ఐఎస్ఎస్ పరీక్షలు 2020కు సంబంధించిన నోటిఫికేషన్‌ను వచ్చే వారంలో విడుదల చేయనుంది.