నోరూరించే ఉపాసన ఆవకాయ పచ్చడి

by Jakkula Samataha |
నోరూరించే ఉపాసన ఆవకాయ పచ్చడి
X

ఆవకాయ… పేరు చెప్తేనే నోరూరుతుంది కదా. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి కలుపుకుని తింటే ఆ టేస్టే వేరప్పా. ఏ చికెన్, మటన్ బిర్యానీ కూడా ఆ టేస్ట్ ముందు పనికిరాదు. సమ్మర్ లో అమ్మమ్మలు, బామ్మలు ఆవకాయ పెట్టే పనిలో మునిగిపోతారు. దాదాపు ఏడాదికి సరిపోయేలా పచ్చడ పెడుతుంటారు.

అయితే తను కూడా ఆవకాయ పెట్టానని చెప్తోంది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కొణిదెల. లాక్ డౌన్ కారణంగా సమయం దొరకడంతో ఫస్ట్ టైమ్ ఆవకాయ ట్రై చేశానని తెలిపింది. దోమకొండ పురాతన వంటకం అయిన ఆవకాయ పచ్చడి తొలిసారి చేసినా చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపింది. తను ఎలా ప్రిపేర్ చేసిందో చెప్తూ …అందుకు ఏ పదార్థాలు అవసరం, ఎంత మోతాదులో అవసరం అనేది తెలుపుతూ పోస్ట్ పెట్టింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చని సూచించింది.

కాగా ఉపాసన పోస్ట్ పై స్పందించిన మంచు లక్ష్మీ ప్రసన్న ఖాళీ డబ్బాను పంపుతాను… ఆవకాయ తో నింపి పంపాలని కోరింది. ఈ డీల్ ను ఒకే చేసింది ఉపాసన. మెగా ఫ్యాన్స్ కూడా… వదినమ్మ ఒక్కసారి మీరు చేసిన పచ్చడి రుచి చూడాలని ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Tags: Mega family, Ram Charan Tej, Upasana Konidela, Summer Special, Avakaya

Advertisement

Next Story

Most Viewed