‘ఇకపై వారెంట్ లేకుండానే తనిఖీ’

by Anukaran |   ( Updated:2020-09-14 07:13:16.0  )
‘ఇకపై వారెంట్ లేకుండానే తనిఖీ’
X

దిశ, వెబ్‌డెస్క్: ఎటువంటి వారెంట్ లేకుండా తనిఖీ చేసేందుకు అధికారాలు కలిగిన స్పెషల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)ని ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో ఉన్న సివిల్ కోర్టులో ఎలాంటి భద్రత లేకపోవడంపై అలహాబాద్ హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. సీఐఎస్ఎఫ్ సభ్యులు వారెంట్ కానీ, మెజిస్ట్రేట్ ఉత్తర్వులు కానీ లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేసేలా అధికారాలు ఉంటాయని తెలుస్తోంది.

తొలి దశలో భాగంగా ఐదు బెటాలియన్లను నియమించనున్నారని, తదుపరి ఈ సంఖ్యను పెంచుకునే అవకాశాలుంటాయని రాష్ట్ర హోమ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, సీఐఎస్ఎఫ్ తొలి దశకు గానూ రూ.1,747 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ కొత్త చర్య ద్వారా రాష్ట్రంలోని నేరాల సంఖ్యను తగ్గించేందుకు వీలవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Read Also…

దొంగలను ధైర్యంగా పట్టుకున్న మహిళా జర్నలిస్ట్..!

Advertisement

Next Story