లక్షలాది వలస కార్మికులకు తప్పనిసరి క్వారంటైన్

by Shamantha N |   ( Updated:2020-03-29 00:16:30.0  )
లక్షలాది వలస కార్మికులకు తప్పనిసరి క్వారంటైన్
X

లక్నో: స్వరాష్ట్రాలకు చేరిన లక్షలాది మంది వలస కార్మికులను తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ లోకి పంపాలని బీహార్, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ మేరకు ఆదేశాలనూ జారీ చేశాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన మూడు వారాల లాక్ డౌన్ తో వలస కార్మికులు స్వరాష్ట్రం చేరేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిని సొంతూరికి తరలించేందుకు ఉత్తర ప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలు ప్రయాణ సదుపాయాలు కల్పించాయి. కరోనా విజృంభిస్తున్న సందర్భంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు పై ఆందోళనల వ్యక్తమయ్యాయి. అందుకే వారిని 14 రోజులపాటు తప్పనిసరిగా నిర్బంధంలోకి పంపాలని ఆ రాష్ట్రాలు నిర్ణయించాయి. గత మూడు రోజులుగా రాష్ట్రంలోకి విచ్చేసిన సుమారు లక్షన్నర మంది వలస కార్మికులను గుర్తించి ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపుల్లో క్వారంటైన్ లోకి పంపాలని జిల్లా అధికారులకు యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్బంధ కాలంలో వారికి అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించింది. కాగా, బీహార్ ప్రభుత్వం మాత్రం సరిహద్దు జిల్లాల్లోనే క్యాంపులు ఏర్పాటు చేసి కార్మికులను క్వారంటైన్ లోకి పంపాలని ఆదేశించింది.

Tags : Quarantine, migrant labourers, workers, up, bihar

Advertisement

Next Story