- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేపీహెచ్బీ కాలనీలో చైన్ స్నాచింగ్
దిశ, కూకట్పల్లి : రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసు లాక్కొని పరారైన సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ పీవీ నరసింహరావు పార్కు సమీపంలో నివాసం ఉంటున్న మేక రాంబాబు భార్య మేక మణి (54) బుధవారం రాత్రి ఇంటి నుంచి నడుచుకుంటూ విజేత సూపర్ మార్కెట్ సమీపంలో అరటి పండ్లు కొనగోలు చేసేందుకు వెళ్తుండగా సాయి బృందావన్ అపార్ట్మెంట్ సమీపంలో వెనక నుంచి నడుచుకుంటూ వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి మణి మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు.
దొంగ అని అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చే లోగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటన అనంతరం బాధితురాలు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారు గొలుసు లాక్కుని పరారైన వ్యక్తి సుమారు 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు వాడై ఉంటాడని, తెలుపు రంగు షర్టు, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.