- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజాం సంస్థానాన్ని కూల్చింది కమ్యూనిస్టులే.. బీవీ రాఘవులు ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నిజాం సంస్థానాన్ని కూల్చింది కమ్యునిస్టులేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో దేశవ్యాప్త రైతు ఉద్యమానికి మద్దతుగా శుక్రవారం సీపీఎం గ్రేటర్ హైదరాబాద్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న బీవీ రాఘవులు మాట్లాడుతూ.. వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కారణంగానే నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వానికి లొంగిందని అన్నారు. భారత సైన్యాలు తమ తుపాకులను రజాకార్లపై ఎక్కుపెట్టకుండా కమ్యునిస్టులపైనే దాడి చేశారని తెలిపారు. ఒక్క రజాకార్‌ను కూడా భారత సైనికులు జైళ్లో పెట్టలేదన్నారు. కానీ, వేలమంది కమ్యునిస్టులను నిర్భందించారని గుర్తుచేశారు. పదిలక్షల ఎకరాల భూ పంపిణీ, వెట్టి చాకిరి నిర్మూలన, భూ సంస్కరణ చట్టాలు, తెలుగు భాషకు గుర్తింపు వంటి విజయాలను ఈ పోరాటంతోనే సాధించారని ఆయన అన్నారు.
కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా నిజాం నిరంకుశ పాలనపై ఐక్య పోరాటం జరిగిందని గుర్తుచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, దాని మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్‌కు నిజాం వ్యతిరేక పోరాటంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. నాటి పోరాటంలోఎందుకు పాల్గొనలేదో అమిత్ షా, బండి సంజయ్‌లు చెప్పాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ఆస్తులన్నీ తన మిత్రులైన అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్‌లో పాల్గొనాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి సుందరయ్య పార్క్‌లోని సుందరయ్య విగ్రహం వరకు భారీ రెడ్ క్లాత్‌తో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు, నంద్యాల నరసింహారెడ్డి, నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, హిమబిందు, బండారు రవికుమార్, పైళ్ల ఆశయ్య, శ్రీనివాసరావు, రాజన్న, దశరథ్, అరుణ జ్యోతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.