నిరుద్యోగ భృతి అమలుచేయాలి: ఉత్తమ్

by Shyam |
నిరుద్యోగ భృతి అమలుచేయాలి: ఉత్తమ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: 2018అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రాష్ట్రంలో వెంటనే నిరుద్యోగ భృతిని అమలు చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుద్యోగులకు రూ.3016 భృతి కల్పిస్తే సమస్యల నుంచి గట్టెక్కుతారని, అటు లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి సైతం ప్రయోజనం చేకూరుతుందన్నారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా నిరుద్యోగ భృతిపై కేసీఆర్ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని లక్షల ఉద్యోగాలు పోయాయన్నారు. రెండోదశ లాక్‌డౌన్ ముగియడానికి మరో వారం రోజులే గడువు ఉన్నందున రాష్ట్ర ఆర్థికవ్యవస్థను పునరుద్దరించడానికి సమగ్రమైన ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కొన్ని కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయని, ఇదే క్రమంలో ప్రైవేట్ కంపెనీలు జీతాల్లో భారీగా కోత విధిస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Tags: Unemployment Benefit, 2018 TRS Manifesto, CM KCR, Uttam Kumar Reddy, TPCC, Corona Virus, Lockdown, Economy

Advertisement

Next Story

Most Viewed