మా గోడు పట్టించుకోండి.. సీఎం గారూ

by Shyam |
మా గోడు పట్టించుకోండి.. సీఎం గారూ
X

దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: తమ గోడును పట్టించుకోవాలని కోరుతూ, తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరాహార దీక్షను చేపట్టారు. శనివారం తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి నివాసంలో దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నిరుద్యోగుల బాధలు సీఎం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ నిరాహార దీక్ష అని తెలిపారు. నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించి, ఉద్యోగాల భర్తీకి ఇయర్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బంధీగా అమలు చేయాల్సిన అవసరం ఉందని, గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా తొంభై వేల పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ వేయాలని కోరారు. జూనియర్ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, ప్రయివేటు పాఠశాలలు కళాశాలల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఇప్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి వెంటనే టెట్ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల పాఠశాలలు కళాశాలలు నడవడం లేదని, కావున అందులో పనిచేస్తున్న వారికి నెలకు రూ.15 వేలు బ్యాంకు అకౌంట్లో వేయాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు వేతనాలు పెంచి, పీటీఐలను రెన్యువల్ చేయాలని, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న మెకానిక్ కండక్టర్, డ్రైవర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి, కొత్తగా ఏర్పడ్డ మండలాలు జిల్లాల్లో సిబ్బందిని వెంటనే భర్తీ చేయడంతో పాటు పంచాయతీ కార్యదర్శులను బేసిక్ పే నిర్ణయించి రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed