- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియురాలి కోసం సొరంగం.. భర్తకు చిక్కిన లవర్!
దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి తన ప్రియురాలిని కలవడం కోసం ఎవరూ చేయని సాహసం చేశాడు. ప్రతీరోజు ఎవరి కంటపడకుండా తన లవర్‌ను కలిసేందుకు వీలుగా ఆమె ఇంటి వరకు ఏకంగా ఓ సొరంగాన్నే తవ్వాడు. అయితే కొంతకాలం నుంచి ఇలా రహస్యంగా కలిసుకుంటున్న వీరి బాగోతం ఓ రోజు బయటపడింది. వీరిద్దరూ కలిసుండటాన్ని చూసిన ప్రియురాలి భర్త.. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా క్షణాల్లో మాయమయ్యాడు. ఎటు వెళ్లాడని ఇల్లంతా వెతుకుతూ, మంచం కింద చూడగా ఓ రంధ్రం కనిపించింది. క్షుణ్ణంగా పరిశీలిస్తే అది సొరంగమని తేలింది. దాని గుండానే అతను రోజూ వస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది.
మెక్సికో నగరానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడైన ఆల్బర్టే, పమేల అనే గృహిణి కొన్నేళ్ల కిందట ప్రేమికులు. వీరి ప్రేమ విఫలం కావడంతో ఎవరిదారి వారు చూసుకున్నారు. ఈ క్రమంలో పమేల సెక్యూరిటీ జాబ్ చేసే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోగా, ఆల్బర్టేకు వేరొక మహిళతో వివాహమైంది. కానీ, వీరిద్దరి మధ్య సంబంధాలు మాత్రం తెగిపోలేదు. ఈ క్రమంలోనే పమేలను రోజూ ఎలాగైనా కలవాల్సిందే అని నిర్ణయించుకున్నాడు ఆల్బర్టే. ఇందుకు పమేల కూడా సహకరించడంతో.. తన ఇంటి నుంచి ఆమె ఇంటి వరకు సొరంగమార్గాన్ని నిర్మించాడు. ఇలా వీరు కలుసుకుంటున్నారు.
కానీ ఒకరోజు పమేల భర్త.. రోజూ వచ్చే సమయానికి కాకుండా కొంచెం ముందుగా ఇంటికి రావడంతో, వీరిద్దరూ అతడి కంటపడ్డారు. వెంటనే పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అతడు క్షణాల్లో మాయమయ్యాడు. ఇంట్లో మంచం కింద నిర్మించిన సొరంగం ద్వారా పరారయ్యేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. వీరిద్దరూ ఘర్షణ పడుతుండగా.. సీన్‌లోకి పోలీసులు ఎంటర్ అవడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, ఈ ఘటన గురించి విన్ని నెటిజన్లు.. ప్రేమ కోసం ఇలా సొరంగాలు కూడా నిర్మిస్తారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.