- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
German: జర్మనీలో కారు బీభత్సం.. ఇద్దరు మృతి.. 60 మందికి గాయాలు
దిశ, నేషనల్ బ్యూరో: జర్మనీ (German)లో కారు బీభత్సం సృష్టించింది. మాగ్డేబర్గ్‌లోని క్రిస్మస్ మార్కెట్ (Christmas Market)లో ప్రజల పైకి కారు దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. క్రిస్మస్ మార్కెట్‌లో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 400 మీటర్ల వరకు కారు దూసుకెళ్లినట్లుగా వెల్లడించారు. కాగా.. ఈ కేసులో సౌదీ అరేబియా(Saudi Arabia)కు చెందిన డాక్టర్ తలేబ్‌ను(50)ను జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన 2006 నుంచి జర్మనీలోనే ఉంటున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, నిందితుడు బీఎమ్‌డబ్ల్యూ కారును అద్దెకు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంపై జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ (Olaf Scholz) ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు సౌదీఅరేబియా విదేశాంగ మంత్రిత్వశాఖ సైతం యాక్సిడెంట్ పై స్పందించింది. ‘జర్మనీలో జరిగిన హింసను ఖండిస్తున్నాం. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది.
వరుస దాడులతో..
క్రిస్మస్ మార్కెట్‌లో జరిగిన ప్రమాదంపై బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాప్ స్కోల్జ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘స్కోల్జ్ వెంటనే రాజీనామా చేయాలి. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) మాత్రమే దేశాన్ని రక్షించగలదు’ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై స్పందించేందుకు జర్మనీ ప్రభుత్వం నిరాకరించింది. ఇకపోతే, జర్మనీలో వరుస దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆగస్టులో సోలింగెన్‌లో జరిగిన స్ట్రీట్ ఫెస్టివల్‌లో కత్తిపోట్లు కలకలం రేపాయి. ముగ్గురు చనిపోగా.. 8 మంది గాయపడ్డారు. సిరియాకు చెందిన అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. జూన్‌లో మన్‌హీమ్‌లో కత్తి దాడి జరిగింది. ఈ దాడిలో పోలీసు చనిపోగా.. అఫ్గాన్ జాతీయుడ్ని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. ఎనిమిదేళ్ల క్రితం సైతం బెర్లిలోని అతిపెద్ద క్రిస్మస్ మార్కెట్‌లోకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఆ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలామందికి గాయలయ్యాయి. ఈ ప్రమాదానికి ట్యునీషియా శరణార్థి కారణమని గుర్తించారు.