- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Assembly: ఆ విషయం నిజమని నిరూపించూ.. రాజీనామా చేస్తా : అసెంబ్లీలో మంత్రి కోమటి రెడ్డి సవాల్
దిశ, వెబ్‌డెస్క్: రైతుబంధు (Raithu Bandhu)తో సాగు విస్తీర్ణం పెరిగిందంటూ కేటీఆర్ (KTR) అవాస్తవాలు చెబుతున్నారని.. నల్లగొండ జిల్లా (Nalgonda District)లో ఒక్క ఎకరా ఆయకట్టు పెరిగినట్లుగా నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy), కేటీఆర్ (KTR)కు సవాల్ విసిరారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ (Free Electricity) ఇచ్చామని సభలో కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) హయాంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. రాష్ట్రం అంతటా కేవలం 11 నుంచి 13 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికైనా కేటీఆర్ (KTR) సభలో నిజాలు మాట్లాడాలంటూ చరుకలంటించారు. రోడ్ల అమ్మకంతో వచ్చిన డబ్బులను రైతుబంధుకు మళ్లించారని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.