- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Formula E race case : ఫార్ములా ఈ- రేస్ కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు
దిశ, వెబ్ డెస్క్ : ఫార్ములా ఈ రేస్ కేసు(Formula E race case)లో ఏసీబీ(ACB)దర్యాప్తు ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఈ కేసులో A-1గా కేటీఆర్, A-2గా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, A-3గా హెచ్‌ఎండీఏ మాజీ అధికారి బీఎల్ఎన్ రెడ్డిలు ఉన్నారు. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలతో పాటు హెచ్ఎండీఏ(HMDA), ఎంఏయూడీ(MAUD) శాఖలకు సంబంధించిన మరికొందరు అధికారులను సైతం ఏసీబీ విచారించనున్నట్లుగా సమాచారం. ఫార్ములా ఈ-రేస్ కు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ను పరిశీలించి, ఎఫ్ఈవో(FEO) నుంచి వచ్చిన ఈ మెయిల్స్, ఎల్ఎఫ్ఏ(LFA) తో పాటు ఇతర లావాదేవీల వివరాలను సైతం ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
విచారణకు సంబంధించి పిలవాల్సిన అధికారులకు, కేసులోని నిందితులకు సోమవారం నోటీసులు జారీ చేయనున్నట్లుగా సమాచారం. కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్ ను ఈ నెల 30వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించడం..తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసిన నేపథ్యంలో అప్పటిలోగా దర్యాప్తు ప్రక్రియను కొనసాగించి మరిన్ని ఆధారాలను సేకరించాలని ఏసీబీ భావిస్తోంది. మరోవైపు ఈడీ(ED) సైతం ఈ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్(ECIR) నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. యూకే లోని ఎఫ్ఈవోకు నగదు బదలాయింపు చేయడంలో ఫెమా(FEMA) నిబంధనల ఉల్లంఘన, మనిలాండరింగ్(PMLA) కింద ఈడీ దర్యాప్తు కొనసాగించనుంది. సోమవారం తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసే అవకాశముంది.