TG Assembly: ‘రైతు భరోసా’ ఎన్ని పంటలు, ఏయే పంటలకు ఇస్తారు..? అసెంబ్లీలో మంత్రి తుమ్మల వర్సెస్ కేటీఆర్

by Shiva |   ( Updated:2024-12-21 05:45:16.0  )
TG Assembly: ‘రైతు భరోసా’ ఎన్ని పంటలు, ఏయే పంటలకు ఇస్తారు..? అసెంబ్లీలో మంత్రి తుమ్మల వర్సెస్ కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతుబంధు (Raithu Bandhu) పథకం ప్రవేశపెట్టిన తరువాతే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లో ‘రైతు భరోసా’ (Raithu Bharosa)పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే, పెట్టుబడి సాయం ఎన్ని పంటలకు ఇస్తారు, ఏయే పంటకు ఇస్తారో సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో అమలు చేసిన రైతుబంధు (Raithu Bandhu)పై కూడా సమగ్రంగా చర్చ జరగాలని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని గుర్తు చేశారు. 11.5 శాతం ఉన్న రైతు ఆత్మహత్యలను 1.5 శాతానికి తగ్గించామని అన్నారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యలు అత్యల్పలంగా నమోదవుతోన్న రాష్ట్రం తెలంగాణే (Telangana) అని తెలిపారు. అయితే, అందుకు సమాధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Minister Thummala Nageshwar Rao) జవాబిస్తూ.. రైతు భరోసా విషయంలో ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు. ప్రజలు, ప్రతిపక్షం సూచనల ప్రకారం విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story