- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Mallu Ravi: వారిని ఐడెంటిఫై చేసి కేసులు పెడతాం.. మల్లు రవి సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: కంచె గచ్చిబౌలి (Kanche Gachibowli) పరిధిలోని మొత్తం 400 ఎకరాల భూ వ్యవహారంలో ఈనెల 3న సుప్రీం కోర్టు (Supreme Court) సీరియస్ అయింది. తదుపరి ఉత్తర్వులు (Further orders) వచ్చే వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని తెలంగాణ సీఎస్ శాంతికుమారి (CS Shanti Kumari)కి ఆదేశించింది. మరోవైపు హెచ్‌సీయూలో విద్యార్థులు ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే హెచ్‌సీయూ (HCU)లోని నార్త్ ఇండియా (North India) విద్యార్థులపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో జరుగుతోన్న డెవలప్‌మెంట్‌ను నార్త్ ఇండియా స్టూడెంట్స్ చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. స్థానిక విద్యార్థులు, యూనివర్సిటీ బయట సోషల్ మీడియా వేదికగా వారు 400 ఎకరాల భూ వ్యవహారంలో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సర్కార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్లను త్వరలోనే గుర్తించి వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రస్తుతం మల్లు రవి చేసిన కామెంట్స్ పొలిటికల్‌గా నెట్టింట దుమారాన్నే రేపుతున్నాయి.