మద్యం పై వింత తీర్మానం.. ఇక ఆ గ్రామస్థుల సంగతి అంతే..

by Shyam |   ( Updated:2021-11-25 07:34:35.0  )
మద్యం పై వింత తీర్మానం.. ఇక ఆ గ్రామస్థుల సంగతి అంతే..
X

దిశ, వెబ్ డెస్క్: మద్యం షాపుల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకవైపు మద్యం షాపులు పెట్టుకోవడానికి ప్రభుత్వం రిజర్వేషన్స్ కూడా ప్రకటించింది. అయితే తమ గ్రామంలో మాత్రం మద్యం కొన్నా, విక్రయించినా, బెల్టు షాపులు నిర్వహించినా జరిమానా విధిస్తామని క్యాసంపల్లి గ్రామ ప్రజలు అంటున్నారు. ఈ గ్రామం కామారెడ్డి పట్టణానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉంది. క్యాసంపల్లి గ్రామస్థులు మద్యంపై కొన్ని షరతులు ఆమోదిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ప్రజల ఆరోగ్యం నిమిత్తం గ్రామంలో మద్య నిషేధం అమలు చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. అన్ని కులాలకు సంబంధించిన కుల పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఒక్కటై మద్యాన్ని ఎవరూ అమ్మవద్దని, బెల్టుషాపులు నిర్వహించకూడదని నిర్ణయించారు. దీంతో గ్రామంలో మద్య నిషేధం కొనసాగుతుంది.

Advertisement

Next Story